జీహెచ్‌ఎంసీ టార్గెట్‌ 68,478 గ్రూపులు | - | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ టార్గెట్‌ 68,478 గ్రూపులు

Published Fri, Mar 7 2025 9:25 AM | Last Updated on Fri, Mar 7 2025 9:20 AM

జీహెచ్‌ఎంసీ టార్గెట్‌ 68,478 గ్రూపులు

జీహెచ్‌ఎంసీ టార్గెట్‌ 68,478 గ్రూపులు

సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటికే వివిధ బాధ్యతలతో సతమతమవుతున్న జీహెచ్‌ఎంసీ యూసీడీ విభాగానికి మున్సిపల్‌ పరిపాలన శాఖ మరో పెద్ద బాధ్యత అప్పగించింది. కాగా.. ఇప్పటికే తమ విభాగం చేయాల్సిన పనులు సజావుగా ముందుకు సాగకుండా.. కుటుంబ సర్వే, రేషన్‌ కార్డుల సర్వేతో సహా స్ట్రీట్‌ వెండర్ల ఇబ్బందుల పరిష్కారం, ప్రభుత్వ కార్యక్రమాలకు జనసమీకరణ.. ఇలా ఎన్నో పనులను అప్పజెప్పుతుండటంతో.. వాటిని పూర్తి చేయలేక ఆ విభాగం సతమతవుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మహిళాశక్తి క్యాంటీన్‌ ఏర్పాటుతో పాటు ఇతరత్రా బాధ్యతలను అప్పగించారు.

కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలి

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తుండటంతో మహిళా దినోత్సవం నుంచి వారికి సంబంధించిన కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేయాలని బల్దియా భావిస్తోంది. సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపులనూ భారీ సంఖ్యలో ఏర్పాటు చేసేందుకు లక్ష్యాలను నిర్దేశించుకుంది. జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం దాదాపు 50 వేల సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుల్లో దాదాపు 5 లక్షల మంది సభ్యులున్నారు. బీపీఎల్‌ పరిధిలోకొచ్చే పేద మహిళల్లో ఇంకా గ్రూపు సభ్యులు కాని వారిని గుర్తించి 68,478 గ్రూపులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంటే.. ప్రస్తుతమున్న గ్రూపుల కంటే ఇంకా ఎక్కువ గ్రూపుల్ని ఏర్పాటు చేయాలన్న మాట.

● మహిళా ఓటర్ల లెక్కలు, గ్రూపుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు తదితరాలను పరిగణనలోకి తీసుకొని జీహెచ్‌ఎంసీలో ఇన్ని గ్రూపుల ఏర్పాటు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో సగం గ్రూపుల్ని ఈ నెలాఖరులోగా ఏర్పాటు చేసి మిగతా సగం గ్రూపుల్ని జూన్‌ వరకు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ మేరకు ఇటీవల సర్క్యులర్‌ జారీ చేసింది. ఇందుకుగాను ప్రతి మంగళవారం వార్డుల్లోని బస్తీల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించింది. జీహెచ్‌ఎంసీతో పాటు గ్రేటర్‌ పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్‌ బోర్డు, శివార్లలోని రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని పురపాలికల్లోనూ కొత్త గ్రూపుల్ని ఏర్పాటు చేయాల్సిందిగా టార్గెట్లను విధించింది.

మేడ్చల్‌ జిల్లా పరిధిలో..

గుండ్ల పోచంపల్లి (36), పోచారం (68), తూంకుంట (4), జవహర్‌నగర్‌(301), ఘట్‌కేసర్‌ (60), కొంపల్లి (121), దమ్మాయిగూడ(255), నిజాంపేట (1214), బోడుప్పల్‌ (254), దుండిగల్‌ (38), నాగారం(155), మేడ్చల్‌ (96), పీర్జాదిగూడ (314).

రంగారెడ్డి జిల్లా పరిధిలో..

బండ్లగూడ జాగీర్‌ (528), మీర్‌పేట (583), మణికొండ(493), శంషాబాద్‌ (130), నార్సింగి (61), తుర్కయాంజాల్‌ (123), బడంగ్‌పేట (502), పెద్దఅంబర్‌పేట (162), ఆదిభట్ల (11), తుక్కుగూడ (14), జల్‌పల్లి (511), ఇబ్రహీం పట్నం (20), కొత్తూరు (7).

కొత్తగా ‘సెల్ఫ్‌హెల్ప్‌’ కోసం..

మహిళా దినోత్సవం నేపథ్యంలో..

ఏర్పాటు చేయాల్సిన గ్రూపుల లక్ష్యం ఇలా..

జీహెచ్‌ఎంసీ: 68,478

కంటోన్మెంట్‌ బోర్డు: 1845

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement