చేవెళ్ల: డీజే సౌండ్‌లతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని చేవెళ్ల ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈనెల 4న చేవెళ్లకు చెందిన నాయక్ తన ఇంట్లో చిన్న విందు ఉండగా డీజే పెట్టించాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూడా సౌండ్‌లతో హోరెత్తించడంతో భరించలేని చుట్టుపక్కల వారు 100 డయల్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో నాయక్‌తో పాటు డీజే అపరేటర్ హరీశ్వర్, డీజే ఓనర్ శివపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు శుక్రవారం వారిని న్యామూర్తి డి.ధీరజ్‌కుమార్ ఎదుట హాజరుపర్చగా ముగ్గురికీ కలిపి రూ.18 వేలు జరిమానా విధించారు. ఒక్కొక్కరు రూ.6 చొప్పున ఫైన్ చెల్లించాలని లేదంటే ఏడు రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చారు.
చిన్నారిపై వీధికుక్కల దాడి
అంబర్‌పేట: ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన శుక్రవారం రాత్రి గోల్నాక కమలనగర్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే లక్ష్మణ్, మమతల కుమార్తె శ్రీలక్ష్మి (19 నెలలు) శుక్రవారం ఇంటి ముందు ఆడుకుంటోంది. అదే సమయంలో అటుగా వచ్చిన వీధికుక్కలు చిన్నారిపై దాడి చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment