
యువకుడి అదృశ్యం
చేవెళ్ల: ఫ్లైవుడ్ షాపులో పనిచేసే ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల కేంద్రంలో రాజస్థాన్‌కు చెందిన హీర్ సింగ్మాసింగ్ రాందేవ్ ఫ్లైవుడ్ దుకాణం నడిపిస్తున్నాడు. ఆయన వద్ద వారి దూరపుబంధువైన జస్వంత్‌సింగ్ (18) మూడు నెలలుగా పనిచేస్తున్నాడు. గురువారం పనికి వచ్చిన యువకుడు సాయంత్రం 4గంటల ప్రాంతంలో రూమ్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. దుకాణం బంద్ చేసిన హీర్ సింగ్మాసింగ్ జస్వంత్‌సింగ్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో షాప్ యజమాని ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ మేరకు శుక్రవారం ఆయన చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment