
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
ఇబ్రహీంపట్నం రూరల్: ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి వెంటనే గ్రౌండింగ్ చేయడంలో వేగం పెంచాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నా రు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. మార్చి 15 వరకు మిషన్ భగీరథ, గ్రిడ్ ఇంట్రా పనులకు గ్రౌండింగ్ చేపట్టి 20 వరకు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ దరకాస్తులకు ప్రాధాన్యతనిస్తూ ఎప్పటికప్పుడు పరిశీలించి గడువులోపు పూర్తి చేయాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా గ్రామాణాభివృద్ధి అధికారి శ్రీలత, పంచాయతీ అధికారి సురేష్ మోహన్, మిషన్ భగీరథ ఈఈ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ రాయితీపైఅవగాహన కల్పించండి
గ్రామాల్లో తాగునీటిఎద్దడి తలెత్తకుండా చూడాలి
కలెక్టర్ నారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment