సాక్షి, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్: సమాజంలో మహిళల పట్ల కొనసాగుతున్న వివక్షపై రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సాక్షి ప్రత్యేక సర్వే నిర్వహించింది. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలికలు, 18నుంచి 25 ఏళ్ల వయసున్న యువతులు, 25 నుంచి 35 సంవత్సరాలున్న అతివలు, 35 నుంచి 50 ఏళ్ల వయసున్న వంద మంది మహిళలను (25 మంది చొప్పున) నాలుగు విభాగాలుగా చేసి సర్వే నిర్వహించగా.. వారి నుంచి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. మహిళలు అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తున్నప్పటికీ పలు చోట్ల వివక్ష కొనసాగుతోందని, స్కూళ్లు, కాలేజీలు, పని ప్రదేశాల్లో ఇతరుల నుంచి కొంత ఇబ్బంది ఎదురవుతోందని, బస్టాప్‌లు, ఆఫీసుల్లో పురుషాధిక్యం ఉందని, సెల్‌ఫోన్లలో వచ్చే మెసేజ్‌లు తమను ఎక్కువగా బాధ పెడుతున్నాయని, వీరిలో తెలియని వారికన్నా తెలిసిన వారే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారని సర్వే వెల్లడిస్తోంది.
మహిళలపై పలుచోట్ల కొనసాగుతున్న వివక్ష
బస్టాప్‌లు, కాలేజీల్లో పురుషాధిక్యం
ఇబ్బంది పెడుతున్న సెల్‌ఫోన్ మెసేజ్‌లు
Comments
Please login to add a commentAdd a comment