శంకర్‌పల్లి: హైదరాబాద్ నుంచి నాగపూర్‌కు గంజాయికి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మోకిల ఠాణా పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. శుక్రవారం సీఐ వీరబాబు తెలిపిన ప్రకారం.. గురువారం సా యంత్రం ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు మీదుగా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు మోకిల పోలీసులు శంకర్‌పల్లి మండలం ఇంద్రారెడ్డి నగర్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. హైదరాబాద్ నుంచి నాగపూర్‌కు స్విఫ్ట్ కారులో వెళ్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన రమావత్ మత్రు(35), నేనావత్ తేజ(29), మహారాష్ట్రకు చెందిన నీలేశ్ బాబన్ కాలే(22)ను అదుపులోకి తీసుకున్నారు. కారులో తనిఖీ చేయగా 52 కిలోల గంజాయి పాకెట్లు లభ్యమయ్యాయి. పోలీసుల విచారణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మోతుగూడెం(ఆంధ్రా–ఒడిశా బార్డర్) నుంచి గంజాయి తీసుకు వచ్చామని.. పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్ వద్దకు చేరుకున్నాక కొంత కారులో.. మిగిలినది సెప్టిక్ ట్యాంక్ వాహనంలో ఉంచి తరలిస్తున్నట్లు వెల్లడించారు. కాగా పోలీసులు సెప్టిక్ ట్యాంకు వాహనం కోసం గాలింపు చేపట్టారు. నిందితుల వద్ద 52 కిలోల గంజాయి, కారు, నాలుగు ఫోన్లు సీజ్ చేశారు. శుక్రవారం నిందితులను చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ నిమిత్తం సంగారెడ్డి జైలుకు తరలించారు.
ముగ్గురికి రిమాండ్
Comments
Please login to add a commentAdd a comment