మొయినాబాద్: విద్యావ్యవస్థలో బహుముక పరిశోధనలను జోడించడంలో విద్యార్థులు, విద్యావేత్తలు, సామాజికవేత్తల పాత్ర కీలకమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి.బాలకృష్ణారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అంగీకృత పరిశోధన, సుస్థిరాభివృద్ధిపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో దీర్ఘకాలిక సవాళ్లను అధిగమించేందుకు పర్యావరణ సుస్థిరత, వనరుల నిర్వహణ, సాంకేతిక అభివృద్ధి రంగాల్లో సృజనాత్మకత అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ వర్సిటీ ప్రొఫెసర్ ఉపద్రస్తా రామమూర్తి, గ్రిట్ కళాశాల డీన్ స్వదేశ్ కుమార్ సింగ్, కేజీరెడ్డి కళాశాల చైర్మన్ కె.కృష్ణారెడ్డి, డైరెక్టర్ రోహిత్ కందకట్ల, ప్రిన్సిపాల్ సాయిసత్యనారాయణరెడ్డి, అరిస్టాటిల్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.శ్రీనివాస్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment