
చిన్నచూపు వద్దు
మాది పూర్వ నల్లగొండజిల్లా హుజూర్‌నగర్. నాన్నకు నలుగురం సంతానం. పేద, మధ్య తరగతి కుటుంబం. ముగ్గురు అమ్మాయిలే అయినామా నాన్న మమ్మల్ని చదువు విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. కష్టపడి చదివించారు. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా సొంతూరిలోనే. విజయవాడలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. కోఠి ఉమెన్స్ కాలేజీలో ఎకనామిక్స్‌లో పీజీ చేశాను. బీఈడీ పూర్తి చేసి, స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాను. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా డైరెక్ట్ సెలక్షన్ ద్వారా వచ్చాను. మిర్యాలగూడలో తొలి పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డిలో ఏడీ చైల్డ్ వెల్ఫేర్‌గా పని చేశాను. ఆ తర్వాత ఇక్కడికి బదిలీపై వచ్చా. నా భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగే. ఆయన రెవెన్యూ విభాగంలో పని చేస్తారు. మాకు ఇద్దరు పిల్లలు. ఇటు ఆఫీసు, అటు ఇంటికి సమప్రాధా న్యత ఇస్తాను. మహిళలను చిన్నచూపు చూడొద్దు. ప్రోత్సహిస్తే.. మగవాళ్లుకు దీటుగా రాణిస్తారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలంటే ముందు చదువుకోవాలి. ఇందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ హాస్టళ్లను కూడా ఏర్పాటు చేసింది.
– సంధ్యారాణి, సీ్త్ర, శిశు సంక్షేమ సంఘం అధికారి
Comments
Please login to add a commentAdd a comment