
పాలనలో ‘కీ’లకం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా పరిపాలనా భవనంలో మొత్తం 192 మంది మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సహా పలు కీలక విభాగాలకు ఉన్నతాధికారులుగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ విభాగంలో 27 మంది, డీఆర్‌డీఏలో 32 మంది, జిల్లా విద్యాశాఖలో 16 మంది, సివిల్ సప్లయ్‌లో 13 మంది, పంచాయతీరాజ్ విభాగంలో 12 మంది, కో ఆపరేటివ్ విభాగంలో తొమ్మిది మంది, ఉద్యాన వన శాఖలో ఆరుగురు, ట్రెజరీలో 8 మంది, సీపీఓలో ఆరుగురు, అర్బన్ సీలింగ్ లాండ్స్‌లో ఆరుగురు, డీ సెక్షన్‌లో ఐదుగురు, సీ సెక్షన్‌లో ముగ్గురు, లాండ్ ప్రొటెక్షన్స్‌లో నలుగురు, భూసేకరణ విభాగంలో ముగ్గురు, హౌసింగ్ కార్పొరేషన్‌లో ముగ్గురు, మత్స్యశాఖలో నలుగురు చొప్పున పని చేస్తున్నారు. పరిశ్రమల శాఖలో నలుగురు, గిరిజన, మైనార్టీ విభాగాల్లో ఆరుగురు, లాండ్స్ రికార్డ్స్ విభాగంలో నలుగురు, బీసీ సంక్షేమశాఖలో నలుగురు, మెప్మాలో ఒకరు చొప్పున మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇక వైద్య ఆరో గ్యశాఖ, సీ్త్ర, శిశు సంక్షేమశాఖల్లో పూర్తిగా వారిదే ఆధిపత్యం. అక్కడ పని చేస్తున్న ఉద్యోగుల్లో మెజార్టీ మహిళలే.
Comments
Please login to add a commentAdd a comment