No Headline
పహాడీషరీఫ్: ఆడ, మగ తేడా లేకుండా ఆ దంపతులు ఇద్దరు కుమార్తెలను పెంచి పెద్ద చేశారు. ఆత్మరక్షణ కోసం కరాటేలో శిక్షణ ఇప్పించారు. ఉన్నత చదువులు చదివిస్తూనే.. బుల్లెట్ బండి, కార్ల డ్రైవింగ్ సైతం నేర్పించి అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. బాలాపూర్ మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన మద్ది సబిత, రాజశేఖర్ రెడ్డి దంపతులకు మణిదీపా రెడ్డి, సహస్రారెడ్డి ఇద్దరు ఆడ పిల్లలు. వారిని ప్రత్యేకంగా పెంచాలనుకున్నారు. పెద్ద కుమార్తె మణిదీపా రెడ్డికి కరాటేతో పాటు బాస్కెట్ బాల్ నేర్పించారు. ఈమె ఇప్పటికే ఎన్నో టోర్నమెంట్‌ల్లో ప్రదర్శనలు ఇచ్చి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంది. ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేరవుతోంది. చిన్న కుమార్తె సహస్రారెడ్డి వైద్య విద్యను అభ్యసిస్తోంది. సబిత 2020–25 మధ్య కాలంలో మీర్‌పేట్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా పని చేశారు. రాజశేఖర్ రెడ్డి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నారు.
వాహనాలు నడుపుతున్న మణిదీపా రెడ్డి, సహస్రా రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment