జై
ఆమెకు
తల్లిగా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతోంది.. మమతానురాగాలకు చిరునామాగా నిలుస్తోంది.. తోబుట్టువుగా ప్రేమను పంచుతోంది.. ఆలిగా మగవాడి బతుకులో సగపాలు తనదిగా కష్టసుఖాల్లో తోడూనీడగా ఉంటోంది.. ప్రతి పురుషుడి విజయం వెనుక ‘ఆమె’ కీలకపాత్ర పోషిస్తోంది.. ఇంటికి దీపం ఇల్లాలుగా కుటుంబానికి వెలుగులు పంచుతోంది.. సేవకు ప్రతిరూపంగా నిలుస్తోంది.. ఒకవైపు వంటింట్లో గరిటె తిప్పుతూనే మరోవైపు రాజకీయాలు, పాలనలోనూ ‘చక్రం’ తిప్పుతోంది.. ఒకప్పుడు గృహిణులుగానే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో ‘రాణి’స్తున్నారు.. ఆకాశంలో సగం కాదు అన్నింట్లోనూ ముందే అని నిరూపిస్తున్నారు.. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..
●
గొప్పశక్తిగా మహిళ
ఒకప్పుడు పూర్తిగా ఇంటికే పరిమితమైన మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒకవైపు కుటుంబ బాధ్యతను.. మరోవైపు అధికారిక కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. పురుషులకు ఏమాత్రం తీసిపోవడం లేదు. పాలనాపరమైన అంశాల్లో అమెరికా కంటే భారతీయ మహిళలలే ముందున్నారు. 40 ఏళ్ల క్రితమే ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా పని చేయడమే ఇందుకు ఉదాహరణ. ఉన్నత చదువులు చదువుకుంటూ.. ఉన్నతంగా రాణిస్తున్నారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా గొప్ప శక్తిగా ఎదుగుతున్నారు
– ప్రతిమాసింగ్, అదనపు కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment