
అంగన్‌వాడీ టీచర్ మృతి
కేశంపేట: అనారోగ్యంతో ఓ అంగన్‌వాడీ టీచర్ మృతి చెందింది. ఈ ఘటన అల్వాల అనుబంధ గ్రామం తులవానిగడ్డలో సోమవారం చోటు చేసుకుంది. ఆమె మరణ వార్త తెలుసుకున్న మాజీ ఎంపీపీ ఎల్గమోని రవీందర్‌యాదవ్, ఐసీడీఎస్ సీడీపీఓ షబనాహుస్సేన్, ఐసీడీఎస్ మాజీ సీడీపీఓ నాగమణి, సూపర్‌వైజర్లు విజయలక్ష్మి, శమంతకమణి , పలువురు అంగన్‌వాడీ టీచర్లు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె భౌతిక కాయానికి నివాళి అర్పించారు. అనంతరం అంత్యక్రియలకు ప్రభుత్వం అందించే ఆర్థికసాయం చెక్కును మృతురాలి కుటుంబ సభ్యులకు సీడీపీఓ అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment