● తుది పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల
● వార్డులు, ఓటర్ల సంఖ్య
ఆధారంగా జాబితా
● గతంలో కంటే తగ్గిన పోలింగ్ కేంద్రాలు
సంగారెడ్డి జోన్: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహణ కొరకు పోలింగ్ కేంద్రాలనుసిద్ధం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొన్ని రోజులుగా అధికారులు కేంద్రాలను గుర్తించి వాటి స్థితిగతులను పరిశీలించారు. వాటన్నింటిని క్రోడీకరించి జాబితాను రూపొందించారు. నివేదికలను పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేశారు. జిల్లాలో నూతనంగా ఏర్పడిన మండలాలతో కలిసి 27 మండలాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన పంచాయతీలు, మున్సిపాలిటీలలో విలీనమైన పంచాయతీలు, కామారెడ్డి జిల్లాలో విలీనం అయిన ఒక పంచాయతీతో కలిసి 646 గ్రామ పంచాయతీలు, 5718 వార్డులు ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొన్నారు. వార్డులు, ఓటర్ల సంఖ్య ఆధారంగా గ్రామ పంచాయతీలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిసెంబరు 7వ తేదిన సిద్ధం చేసిన ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను ఎంపీడీఓలచే ప్రచురణ చేసి, 10వ తేదీన జిల్లా స్థాయిలో ఎన్నికల అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితాపై వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 12న మండల స్థాయిలో అధికారులు రాజకీయ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ముసాయిదా జాబితాపై 7నుంచి 12వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి, 13న అభ్యంతరాలను పరిష్కరించి, 16న కలెక్టర్ ఆదేశాలతో ఆమోదం చేసి, 17న మండల అధికారులు తుది జాబితాను విడుదల చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెద్ద గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం చేసింది. అదే విధంగా గ్రామ జనాభా ఆధారంగా నూతన పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు గతంలో 5,778 వార్డులు ఉండగా.. ప్రస్తుతం 5,718 వార్డులు ఉన్నాయి. వార్డులతో పాటు ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే 650 కంటే ఎక్కువగా ఉంటే మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో గతంలో 5,778 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ప్రస్తుతం 5,732 కేంద్రాలను గుర్తించి, జాబితాను విడుదల చేశారు.
మౌలిక వసతులు.. దూరభారం తగ్గింపు
పోలింగ్ కేంద్రాలలో విద్యుత్, తాగు నీరు, వికలాంగుల కొరకు ర్యాంపు, టాయిలెట్, బాత్రూం వంటి వసతులు కల్పిస్తూ కేంద్రాలను గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఓటు వేసేందుకు దూర భారం తగ్గించేందుకు గ్రామానికి దగ్గరగా ఉండే భవనాలను ఎంపిక చేశారు.
నియోజవర్గాల వారీగా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు
నియోజకవర్గం సీ్త్రలు పురుషులు ఇతరులు మొత్తం పోలింగ్ కేంద్రాలు
అందోల్ 84214 81407 6 165627 1252
నారాయణఖేడ్ 94093 95116 6 189215 1620
నర్సాపూర్ 21697 20651 2 42350 334
పటాన్‌చెరు 59497 61107 9 120613 454
సంగారెడ్డి 67990 65322 27 133339 810
జహీరాబాద్ 100248 100026 2 200276 1262
మొత్తం 423629 427739 52 851420 5732
Comments
Please login to add a commentAdd a comment