
జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు అన్నారు. బుధవారం మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో ఇంటింటికీ సీపీఎం పేరుతో విరాళాల సేకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి రాష్ట్రాల హక్కులను హరిస్తుందన్నారు. సంగారెడ్డి పట్టణంలో వచ్చే నెల 25 నుంచి 28 వరకు జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం మండలం కార్యదర్శి ప్రవీణ్, నాయకులు అనిల్, మల్లేశ్, పుష్పమ్మ, ప్రసాద్, శ్రీనివాస్, మోహన్, పాండురంగం, మోహన్‌చారి తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు
Comments
Please login to add a commentAdd a comment