సిద్దిపేటకమాన్: పార్క్ చేసిన బైక్ దొంగతనానికి గురైన ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం మేరకు.. సిద్దిపేట పట్టణం హనుమాన్ నగర్‌కు చెందిన పొర్ల చరణ్ స్థానికంగా వ్యాపారం చేస్తుంటాడు. వ్యక్తిగత పని నిమిత్తం బయటకు వెళ్లిన చరణ్ పట్టణంలోని ఎస్‌ఎల్ కాంప్లెక్స్ వద్ద 6న బైక్ పార్క్ చేసి వెళ్లాడు. తిరిగి మరుసటి రోజు వచ్చి చూడగా కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా దొరకలేదు. శనివారం బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
దంతన్‌పల్లిలో..
శివ్వంపేట(నర్సాపూర్) : పార్క్ చేసిన బైక్ దొంగతనానికి గురైన ఘటన మండల పరిధి దంతన్‌పల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి కథనం మేరకు.. గ్రామానికి చెందిన గొల్ల రాములు శుక్రవారం సాయంత్రం హోండా బైక్‌పై పొలం వద్ద వెళ్లాడు. బైక్ పార్కింగ్ చేసి పంటను చూసి వచ్చే సరికి కనిపించలేదు. చుట్టు పక్కల వెతికినా కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
పేకాటరాయుళ్లపై కేసు
రేగోడ్(మెదక్): పేకాట స్థావరంపై దాడి చేసి పలువురిపై కేసు నమోదు చేసిన ఘటన మండల కేంద్రమైన రేగోడ్‌లో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ పోచయ్య కథనం మేరకు.. మండలంలోని కొత్వాన్‌పల్లి రోడ్డు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం వచ్చింది. పేకాట స్థావరంపై దాడి చేయగా ముగ్గురు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ.1,600 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
దొంగల బీభత్సం
– ఇంట్లో 28 తులాల బంగారం,రూ.1.60 లక్షల నగదు అపహరణ
వట్‌పల్లి(అందోల్): గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడిన ఘటన అందోలు మండల పరిధిలోని ఎర్రారం గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన శేషారెడ్డి పటాన్ చెరు సమీపంలోని ఇంద్రేశం వద్ద గల కళాశాలలో చదువుతున్న కూతురి ఆరోగ్యం బాగాలేదని చూడటానికి శుక్రవారం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. కూతురిని ఆస్పత్రిలో చికిత్స చేయించి, బంధువుల ఫంక్షన్‌కు వెళ్లి 14న సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తాళం పగులగొట్టి ఉండగా లోపలికి వెళ్లి చూశాడు. దొంగలు బీరువా తెరచి అందులోని 28 తులాల బంగారం రూ.1.60 లక్షల నగదు, 16 తులాల వెండిని ఎత్తుకెళ్లారు. వెంటనే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లు ప్రవీణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి లకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ అనిల్ కుమార్, ఎస్‌ఐ పాండు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. బాధితుడు జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment