
మ్యాట్రిమోనీ పేరుతో అమ్మాయిని మోసం చేసి
● పెళ్లి చేసుకుంటానని రూ.5.50 లక్షలు తీసుకున్న వైనం ● పోలీసుల అదుపులో నిందితుడు
చేర్యాల(సిద్దిపేట): మ్యాట్రిమోనీ పేరు చెప్పి అమ్మాయిలతో పరిచయం పెంచుకొని డబ్బులు తీసుకొని మోసం చేస్తున్న నిందితుడిని చేర్యాల పోలీసులు అరెస్టు చేశారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లోని సీఐ కార్యాలయంలో సీఐ శ్రీను కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా బేతంచెర్లకు చెందిన గుమ్మనా వివేకానంద రెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అమ్మాయికి మ్యాట్రిమోనీ పేరుతో లింకు పంపించాడు. లింక్ ఓపెన్ చేసి అతడితో మాట్లాడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తర్వాత అత్యవసరంగా డబ్బులు అవసరమున్నాయని, త్వరలోనే తిరిగిస్తానని చెప్పి విడతల వారీగా రూ.5,50,000 తీసుకున్నాడు. తర్వాత ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. అనుమానం వచ్చిన అమ్మాయి పెళ్లి పేరుతో మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంిపినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment