79 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
సిద్దిపేట సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: పోలీసు కమిషనరేట్ పరిధిలో శనివారం రాత్రి ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించి డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. పట్టుబడిన వాహనదారులపై 79 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తరచుగా ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించి, డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, టూటౌన్ సీఐ ఉపేందర్, త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్, రూరల్ సీఐ శ్రీను, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment