
ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు
నారాయణఖేడ్: సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలను నారాయణఖేడ్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి స్వగృహం ఆవరణలో కాంగ్రెస్, జీఎంఆర్ ఫౌండేషన్, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఈ వేడుకల్లో సాధు సంతుల రాష్ట్ర ప్రతినిధి సంగ్రామ మహారాజ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొని పూజలు చేశారు. అనంతరం రాజీవ్ చౌక్‌వరకు శోభాయాత్ర నిర్వహిచి సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి నివాళులర్పించారు. జర్నలిస్టు కాలనీలోని భవానీ మాత ఆలయంలో భోగ్‌బండార్, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. దేవిదాస్ మహారాజ్, జీఎంఆర్ ఫౌండేషన్ బాధ్యులు గుర్రపు మశ్చందర్, సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ చౌహాన్, మాజీ జెడ్పీటీసీ రవీందర్‌నాయక్, గిరిజన సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులుపాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment