
ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి రూరల్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈనెల 17న ప్రతీ ఒక్కరు మొక్క నాటాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో శనివారం ఆయన మొక్క నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...హరితహారం పేరుతో తెలంగాణను ఆకుపచ్చగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అంతరించిపోతున్న అడవులను కాపాడే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, నాగరాజ్ గౌడ్, విఠల్,నర్సింలు, గోవర్ధన్ రెడ్డి, పాల్గొన్నారు.
కదం తొక్కిన మహిళలు
11వ రోజుకు చేరిన
‘ప్యారానగర్’నిరసన దీక్షలు
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్ డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు 11వ రోజుకు చేరాయి. మహిళలు శనివారం పెద్ద సంఖ్యలో పాల్గొని ఆందోళన చేపట్టారు. ఆటోర్యాలీ, ఎడ్లబండ్ల ర్యాలీలతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు డంపింగ్‌యార్డు నిర్మాణ పనులు అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. డంపింగ్‌యార్డు ఏర్పాటును ప్రభుత్వం విరమించేదాక తమ పోరాటం ఆపేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, మహిళలు, రైతులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆ స్థాయి రేవంత్‌కు లేదు
బీజేపీ ఓబీసీ మోర్చా
రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రధాని నరేంద్ర మోదీ అగ్ర కులస్తుడంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్ మండిపడ్డారు. సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ బీసీగా కన్వెర్ట్ అయ్యారని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల ఐక్యత వల్లనే దేశంలో వివిధ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, బీసీల గురించి మాట్లాడే నైతికహక్కు రేవంత్‌కు లేదన్నారు. బీసీల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని, బీసీ హాస్టళ్లలో వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన రిజర్వేషన్ల హామీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ భాను ప్రకాశ్, జిల్లా ఉపాధ్యక్షుడు రాములు, జిల్లా కార్యదర్శి నాగరాజ్, ఓబీసీ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ
సభ్యుడు చుక్కా రాములు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రజాభిప్రాయానికి వ్యతిరేకమైన ప్యారానగర్ డంపింగ్‌యార్డ్‌ను రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్‌లో శనివారం జరిగిన సీపీఎం నాయకుల జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పర్యావరణానికి నష్టం కలిగే విధంగా ప్యారానగర్ డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టడం సరైంది కాదన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాణిక్యం, రాజయ్య, రాంచందర్, నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి

ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి
Comments
Please login to add a commentAdd a comment