రెండు కార్లు ఢీ : ఒకరి మృతి
గజ్వేల్‌రూరల్: ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని గజ్వేల్–పిడిచెడ్ మార్గంలో ఆదివారం చోటు చేసుకుంది. గజ్వేల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొల్గూరుకు చెందిన వెంకటేష్‌తో పాటు అతని బంధువులైన గొట్టిముక్కలకు చెందిన వెంకటేశ్ (40), నాని, సాయిగౌడ్‌లు గజ్వేల్ నుంచి కారులో కొల్గూరు వైపు వస్తున్నారు. బయ్యారం చౌరస్తా మీదుగా మేథినీపూర్ వచ్చేందుకు బయలుదేరగా గజ్వేల్–పిడిచెడ్ మార్గంలో ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో గొట్టిముక్కులకు చెందిన వెంకటేష్ తీవ్ర గాయాలకు గురై మృతి చెందాడు. ప్రమాద విషయం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రామాయంపేటలో మరొకరు..
రామాయంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ బాల్‌రాజ్ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కాస నవీన్ (28) శనివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటు వెళ్తుండగా.. వెనుకనుంచి అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవీన్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడి నుంచి నుంచి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్‌ఐ బాల్‌రాజ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు కార్లు ఢీ : ఒకరి మృతి
Comments
Please login to add a commentAdd a comment