116 టన్నుల ఇసుక డంపులు స్వాధీనం
ముగ్గురిపై కేసు నమోదు
కొండపాక(గజ్వేల్): అక్రమంగా ఇసుకను డంపు చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు కుకునూరుపల్లి ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. సిద్దిపేట టాస్క్‌ఫోర్స్, కుకునూరుపల్లి పోలీసులు సంయుక్తంగా ఆదివారం దాడిచేసి మూడు చోట్ల అక్రమ డంపులను స్వాధీనం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కొండపాక మండలంలోని రవీంద్రనగర్ శివారులో రాజీవ్ రహదారికి సమీపాల్లో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ కథనం ప్రకారం.. రవీంద్రనగర్‌కు చెందిన తులశం పోశయ్య, కొమిరి మహేశ్, బోదాస్ నరేశ్ కొంతకాలంగా రాజీవ్ రహదారికి సమీపంలోని రహస్య ప్రదేశాలలో అక్రమంగా ఇసుకను డంపు చేస్తూ ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి మూడు చోట్ల దాడులు చేసి 116 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుకను, మట్టిని, మొరం, రేషన్ బియ్యాన్ని రవాణా చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు. గ్రామాల్లో పేకాట, గంజాయి తదితర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment