పోలీసులకు దొంగల అప్పగింత
శివ్వంపేట(నర్సాపూర్): మండలంలోని పెద్ద గొట్టిముక్కుల శివారులోని భవ్యస్ ఫార్మా కంపెనీలో స్క్రాప్‌ను దొంగిలిస్తున్న వారిని కంపెనీ యజమాని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి నలుగురు వ్యక్తులు కంపెనీలోకి చొరబడి స్క్రాప్, ఐరన్ రాడ్లు, కేబుల్ వైర్లను దొంగిలించి గోడపై నుంచి బయటకు వేస్తుండగా కంపెనీ యజమాని సీసీ కెమెరాలో గమనించాడు. వెంటనే సెక్యూరిటీని అప్రమత్తం చేశాడు. అనంతరం కంపెనీ వద్దకు చేరుకొని సిబ్బందితో కలిసి దొంగలను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. రెండు బైకులను సైతం అప్పగించారు. కొద్ది రోజులుగా కంపెనీ నడవడం లేదు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన ముగ్గురు.. అందులో ఒకరు బీహార్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వీరు చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయ బోర్ల వద్ద స్టార్టర్లు కేబుల్ వైర్లు దొంగిలించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ యజమాని ఫిర్యాదు మేరకు నలుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment