బ్యాంకుకు వెళ్తున్నట్లు చెప్పి..
మహిళ అదృశ్యం
వర్గల్(గజ్వేల్): బ్యాంకులో డబ్బులు తీసుకునేందుకు వెళ్లిన మహిళ ఆచూకీ తెలియకుండాపోయింది. వర్గల్ మండలం అనంతగిరిపల్లి లో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆదివారం మిస్సింగ్ కేసు నమోదైంది. గౌరారం ఏఎస్‌ఐ పోచాగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరిపల్లికి చెందిన దార యాదమ్మ(40) భర్త కొంతకాలం క్రితం మృతిచెందాడు. ఆమె కూలీ పని చేస్తున్నారు. శనివారం ఉదయం బ్యాంకులో డబ్బుల కోసం వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లారు. ఆ తరువాత ఇంటికి తిరిగిరాలేదు. ఆమె కుమారుడు సాయికుమా ర్ తల్లి నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్‌లో ఉంది. దీంతో ఆందోళనకు గురై తల్లి జాడ కోసం అంతటా వెతికినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆదివారం గౌరారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ పేర్కొన్నారు.
వ్యక్తి అదృశ్యం
శివ్వంపేట(నర్సాపూర్): వ్యక్తి కనిపించకుండా పోయిన సంఘటన ఆదివారం మండలంలోని తాళ్లపల్లిగడ్డ తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన ధనావత్ రాంచందర్ ఈనెల 11న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని, అతని భార్య విజయ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment