డంపింగ్‌యార్డ్‌పై నిరసనల వెల్లువ
బైక్ ర్యాలీతో నిరసన
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటు వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలు 12వ రోజుకు చేరుకున్నాయి. మండలంలోని గ్రామ గ్రామాల్లో సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసన ర్యాలీలు, రిలే నిరాహార దీక్షల కార్యక్రమాలకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరై మద్దతు తెలిపారు. డంపింగ్‌యార్డ్ ఏర్పాటు చేయాలని చూస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా గుమ్మడిదల నుంచి అన్నారం వరకు ఆందోళనకారులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జేఏసీ సభ్యులు రైతులు మహిళలు యువకులు, పాల్గొన్నారు.
మద్దతిచ్చిన నర్సాపూర్
ఎమ్మెల్యే సునీతారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment