ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
జహీరాబాద్ టౌన్: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గెలిపించాలని కోరుతూ మాజీ ఎంపీ. బీబీపాటిల్ ఆదివారం జహీరాబాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పట్టభద్రులను కలిశారు. ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని, అందువల్ల బీజేపీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ జగన్నాథ్, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, గొల్ల భాస్కర్, సుధీర్ బండారీ, మల్లికార్జున్ పాటిల్, శోభారాణి తదితరులు ఉన్నారు.
మల్లన్న జాతరకు రండి
చేగుంట(తూప్రాన్): మండలంలోని ఇబ్రహీంపూర్ మల్లన్న జాతరకు రావాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు హైదరాబాద్‌లో ఆదివారం నాయకులు ఆహ్వానపత్రిక అందజేశారు. ఈనెల 23న భ్రమరాంబ సహిత మల్లికార్జునస్వామి సప్తమ వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment