రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కొల్చారం(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రానికి సమీపంలోని మెదక్–నర్సాపూర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటు చసుకుంది. ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కన్నారం గ్రామానికి చెందిన బసవన్నగారి రాజేందర్ (25) హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసముంటున్నాడు. రెండురోజుల కిందట గ్రామానికి వచ్చిన రాజేందర్ ఆదివారం ఉదయం మెదక్ పట్టణంలో పని నిమిత్తం వెళ్లి తిరిగొస్తున్నాడు. మండల కేంద్రానికి సమీపంలోని లోతు వాగు మలుపు వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు రాజేందర్ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతూ యువకుడు
తూప్రాన్: పురుగు మందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన తూప్రాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం ఎస్‌ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం.. తూప్రాన్ మండలం మల్కాపూర్‌కు చెందిన మామిండ్ల కనకరాజు(30) తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో కలిసి ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. కనకరాజుకు అప్పులు కావడంతో తీర్చలేక మనస్తాపం చెంది 9న ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అయిపోయాక 15న ఇంటికి తీసుకొచ్చారు. 16న సాయంత్రం మరోసారి అస్వస్థతకు గురి కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
Comments
Please login to add a commentAdd a comment