సరైన పత్రాలు లేని
92 బైకులు, 5 ఆటోలు సీజ్
తూప్రాన్: అనుమానిత వ్యక్తులు కనిపించినా, అసాంఘిక కార్యక్రమాలు జరిగినా తమ దృష్టికి తేవాలని తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి తెలిపారు. మంగళవారం తూప్రాన్ మున్సిపాల్టీ పరిధిలోని డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద డీఎస్పీ ఆధ్వర్యంలో 7 బృందాలతో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సరైన ధ్రువపత్రాలు లేని 92 బైకులు, 5 ఆటోలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ వాహనాలకు సంబంధించిన పత్రాలను చూపి తమ వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు.
రేషన్ బియ్యం పట్టివేత
రామచంద్రాపురం(పటాన్‌చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు శివారులో రేషన్ బియ్యం పట్టుకున్నట్లు కొల్లూరు ఇన్‌స్పెక్టర్ రవీందర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మో కిల నుంచి రింగ్‌రోడ్డు మీదుగా కర్నూలు తరలిస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రింగ్‌రోడ్డుపై రేషన్ బియ్యం తరలిస్తున్న లారీను పట్టుకొని 34 టన్నులు స్వాధీ నం చేసుకున్నట్లు తెలిపారు. మంగళవారం సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.
దాబాలో తనిఖీలు
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): మండలంలోని నందికంది శివారులోని రాజస్థానీ దాబాలో మంగళవారం ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రాజస్థాన్ కు చెందిన లక్ష్మణ్ రామ్ సదాశివపేట పట్టణంలో నివాసం ఉంటూ సొంత గ్రామం నుంచి పాపి స్ట్రా పౌడర్ కొని దాబా చుట్టుపక్కల వినియోగదారులకు అధిక ధరలకు అమ్ముతున్నాడు. నమ్మదిన సమాచారం మేరకు తనిఖీ చేసి 518 గ్రాముల పౌడర్, ఫోన్‌ను స్వాధీనం చేసుకొని యజమాని లక్ష్మణ్ అదుపులోకి తీసుకున్నామని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మెదక్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తనిఖీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ మెదక్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు, సీఐ వీణా రెడ్డి, ఎస్‌ఐ అనిల్ కుమార్, సిబ్బంది అలీం, సతీష్ మోహన్, గోపాల్, ప్రహ్లద్, తదితరులు పాల్గొన్నారు.
యూనివర్శిటీకి
భాగ్యరెడ్డి వర్మ పేరు పెట్టాలి
మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మల్లేశం
జోగిపేట(అందోల్): జోగిని వ్యవస్థను పూర్తిగా రూపుమాపడంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు ఎ.మల్లేశం అన్నారు. మంగళవారం జోగిపేటలోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ 86వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాగ్యరెడ్డి వర్మ జీవితకాలమంతా అంటరానితనం, అసమానతలు, బాలికలకు విద్యా సౌకర్యాలు కల్పించడానికి కృషి చేసారన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మేతరి కరుణాకర్, మండల అధ్యక్షుడు బహుజన ప్రసాద్, ఉపాధ్యక్షుడు రాజు, మున్సిపల్ అధ్యక్షుడు గోపాల్, లక్ష్మణ్, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment