సంగారెడ్డి జోన్: గ్రామాల్లో ఇంటి పన్ను వసూళ్లలో వేగం పెంచి వందశాతం పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పంచాయతీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మండల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అధికారులు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ పన్ను చెల్లింపు అవసరాన్ని తెలియజేయాలన్నారు. గ్రామాల్లో ఇంటి యజమానులు, ఇంటి పన్ను చెల్లించేందుకు ముందుకు రావాలని కోరారు. రేషన్ కార్డుల వెరిఫికేషన్ పూర్తిగా పారదర్శకంగా జరగాలని అర్హులైన వారికి మాత్రమే రేషన్ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి సంబంధించి పూర్తి సమాచారం అధికార యంత్రాగణానికి అందుబాటులో ఉండాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు, పాఠశాలలను, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలను క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, డీపీఓ సాయిబాబా, ట్రైనీ కలెక్టర్ మనోజ్, సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ వల్లూరు క్రాంతి
Comments
Please login to add a commentAdd a comment