తంప్లూర్‌లో వ్యక్తి
టేక్మాల్(మెదక్): ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్మకు పా ల్పడిన ఘటన టేక్మాల్ మండలంలోని తంప్లూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ దయానంద్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన చాకలి అశోక్ (38), వెంకట్రావు పేటకు చెందిన వెంకటలక్ష్మీకి 20 ఏళ్ల కింద వివాహం జరిగింది. వీరిద్దరూ హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. వీరిద్దరి మధ్య కుటుంబ విషయంలో కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. 16న దంపతులిద్దరూ తంప్లూర్ గ్రామానికి వచ్చారు. అదే రోజు మధ్యాహ్నం ఇంటి వద్ద గొడవ జరగడంతో వెంకటలక్ష్మీ హైదరాబాద్ వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన అశోక్ సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి చాకలి పోచయ్య మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నార్సింగ్‌లో యువకుడు
పాపన్నపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మ హత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని నార్సింగిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. మధ్యప్రదేశ్ కు చెందిన సంజీవ్ కుమార్ (25) ఉపాధి నిమిత్తం రాష్ట్రానికి వచ్చి కామారెడ్డికి చెందిన శ్రీలత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. కొంత కాలంగా పాపన్నపేట మండలం నార్సింగి గ్రామంలో వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగొద్దని చెప్పినా వినకపోవడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న భార్య శ్రీలత ఘటనా స్థలికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment