కొత్త రకం శనగతో అధిక దిగుబడులు
జగదేవ్‌పూర్(గజ్వేల్): రైతులు ఎన్‌బీ ఈజీ 47 కొత్త రకం శనగను సాగు చేసుకోవాలని, దీంతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పల్లవి, కో ఆర్డినేటర్ విజయ్ తెలిపారు. మండల కేంద్రమైన జగదేవ్‌పూర్, అలిరాజ్‌పేట గ్రామంలో రైతుల పొలాల్లో వ్యవసాయ శాఖ సహకారంతో క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ రకం శనగను సాగు చేస్తే నిటారుగా పెరగడమే కాకుండా కాయ పైకి వస్తుందని, మెషిన్ హార్ వెస్టింగ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుందన్నారు. ఎండు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకొని 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. అనంతరం ఎనుగుల శ్రీనివాస్‌రెడ్డి రైతు పొలంలో వేసిన ధనియాల సాగును పరిశీలించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వసంతరావు, ఏఈఓ కవిత, రైతులు పాల్గొన్నారు.
ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పల్లవి
Comments
Please login to add a commentAdd a comment