జహీరాబాద్: బాల్య వివాహాలను నివారించాల్సి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లలితకుమారి అన్నారు. మంగళవారం జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బాల్యవివాహాల నివారణపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ స్థాయిలో బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, పంచాయతీ కార్యదర్శులు, వీఓ లీడర్లపై ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండని బాలిక, 21 సంవత్సరాలు నిండని యువకుడికి వివాహం చేస్తే శిక్షార్హులు అవుతారన్నారు. అత్యవసరమైన సమయంలో మహిళలు హెల్ప్‌లైన్ నం.181, చైల్డ్ హెల్ప్‌లైన్ నెం.1098, పోలీసు హెల్ప్‌లైన్ నెం.100కు కాల్ చేసి వారి సహాయం తీసుకోవచ్చని సూచించారు. బాల్య వివాహాలు, అక్రమ రవాణా, దత్తత మిషన్ వాత్సల్య పథకాల గురించి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment