
అమీన్‌పూర్‌లో స్కిల్ యూనివర్సిటీ
విధులకు గైర్హాజరైతే వేటు వేయండి
పటాన్‌చెరు: అమీన్‌పూర్‌లో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ, నవోదయ పాఠశాల ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన మంగళవారం అమీన్‌పూర్‌లోని సర్వే నంబర్ 993లో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. స్కిల్ యూనివర్సిటీ కోసం 15 ఎకరాలు, అలాగే నవోదయ పాఠశాల ఏర్పాటు కోసం మరో 25 ఎకరాలు స్థలాన్ని కేటాయించే అవకాశం ఉంది. స్కిల్ యూనివర్సిటీ, నవోదయ పాఠశాల ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వం భూములను పరిశీలించినట్లు హరిచందన తెలిపారు. త్వరలో ఇవి అమల్లోకి రానున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆమెతో పాటు జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, ఇన్‌చార్జి తహసీల్దార్ హరీష్ చంద్రప్రసాద్, కమిషనర్ జ్యోతిరెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ మహేష్‌దత్
సంగారెడ్డి జోన్: ఎన్నికల విధులకు హాజరు కాని ఉద్యోగులను సస్పెండ్ చేయాలని నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ బి.మహేశ్‌దత్ ఏక్కా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని ఎమ్మెల్సీ ఎన్నికల నోడల్ అధికారులు, ఏఆర్‌ఓ అధికారులతో ఎన్నికల విధులపై సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు తారా డిగ్రీ కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని, అంబేద్కర్ స్టేడియంలోని డీఆర్సీ సెంటర్‌ను కలెక్టర్ క్రాంతితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్నికలకు ఎంతో తేడా ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణను సవాల్‌గా తీసుకొని పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఓటర్లు, అభ్యర్థులు ఉన్నత విద్యావంతులు ఉంటారని తెలిపారు. అభ్యర్థులు నిబంధనలపై అవగాహన కలిగి ఉంటారని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, అదనపు ఎస్పీ సంజీవరావు, ట్రైనీ కలెక్టర్ మనోజ్, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
నవోదయ పాఠశాల కూడా..
స్థలాన్ని పరిశీలించిన ఆర్‌అండ్‌బీ కార్యదర్శి హరిచందన

అమీన్‌పూర్‌లో స్కిల్ యూనివర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment