
పశువుల వ్యాపారానికి అడ్డా ..
శుక్రవారం వచ్చిందంటే పశువుల సంతకు భలే గిరాకీ ఉంటుంది. పశువుల వ్యాపారానికి అడ్డాగా హుస్నాబాద్ నిలుస్తోంది. గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు క్రయ, విక్రయాలు జరుపుకొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు వస్తుంటారు. వివిధ జిల్లాల నుంచి వ్యాపారులు వచ్చి పశువులను కొనుగోలు చేసి వాహనాల్లో హైదరాబాద్ లాంటి పట్టణాలకు తరలిస్తారు. వార సంతలో అమ్మే పశువు ఒక్కింటికీ రూ.250 చొప్పున అమ్మిన వారి నుంచి, కొన్నవారి నుంచి రుసుం వసూలు చేస్తారు. గొర్రెలు, మేకలకు రూ.200 చొప్పున తీసుకుంటారు. ఒక్క రోజే లక్షల్లో లావాదేవీలు జరుగుతాయి. కోట్లల్లో వ్యాపారం జరుగుతున్న అంగడిలో కనీస వసతులు మాత్రం ఉండవు. అలాగే లావాదేవీలు జరుగుతున్నప్పుడు ఎలాంటి రక్షణ లేదు. అధికారులు నామమాత్రపు షెడ్లు వేసి చేతులు దులుపుకొంటున్నారు.