ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఎన్నికల ముందు ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీలిచ్చారని, వాటిని వెంటనే అమలు చేయాలని తపస్ రాష్ట్ర నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో తపస్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి శ్రీనాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగ నర్సిరెడ్డిలు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు త్రిశంకు స్వర్గాన్ని చూపించిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనే వంకతో మొండిచేయి చూపడం దారుణమన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై మాట్లాడిన తీరు మంచిగా లేదన్నారు. హామీలు అమలు చేయకుంటే తపస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి, లింగమూర్తి, శ్రీనివాస్‌రెడ్డి, దేవదాస్, జైపాల్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
తపస్ రాష్ట్ర నాయకుడు