ఆన్సర్ బుక్‌లెట్ పైన ఎలాంటి పేరు గాని, ఇతర వివరాలు రాయరాదు. ఇన్విజిలేటర్‌లు చేప్పే ప్రతీ సూచన తప్పకుండా పాటించాలి. ఆన్సర్‌షీట్‌లో కొట్టివేతలు లేకుండా నీట్‌గా జవాబులు రాయాలి. తెలిసిన ప్రశ్నలకు జవాబుల నుంచి తెలియని ప్రశ్నలకు జవాబులు రాయడం ద్వారా సమయం ఆదా అవుతుంది. రాత్రి 10 గంటల వరకే చదవాలి, ఉదయం 4.30 గంటలకు నిద్ర లేచి చదవడం మంచిది. అర్థరాత్రి వరకు చదవడం వలన పరీక్ష హాల్‌లో నిద్ర రావడం, ఇబ్బందికరంగా మారుతుంది. ఘన రూప ఆహారం కాకుండా, ద్రవరూప ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
–రాధారి నాగరాజు, మోటివేషనల్ స్పీకర్,
లైఫ్ స్కిల్స్ కోచ్, సిద్దిపేట