జహీరాబాద్ టౌన్: పట్టణంలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి చంద్రశేఖర్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ నిర్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ, సురేశ్ షెట్కార్‌లు మాట్లాడుతూ...ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ అన్నారు. కార్యక్రమంలో సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్, గిరిధర్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ తన్వీర్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.