వర్గల్(గజ్వేల్): 2025–26 విద్యాసంవత్సరం ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ నవోదయ విద్యాలయం ఆరో తరగతిలో ప్రవేశం కోసం జనవరి 18న నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయని వర్గల్ నవోదయ ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. ఫలితాల వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత పొందిన అభ్యర్థులకు సమాచారం చేర వేశామని, హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను నవోదయ విద్యాలయ సమితికి చెందిన హెచ్‌టీటీపీఎస్://సీబీఎస్‌ఈఐటీ.ఇన్/సీబీఎస్‌ఈ/2025/ఎన్‌వీఎస్–ఆర్‌ఈఎస్‌యూఎల్‌టీ/రిజల్ట్.ఏఎస్‌పీఎక్స్ వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చన్నారు. అర్హత పొందిన 80 మంది అభ్యర్థులకు ఫోన్ ద్వారా, పోస్టు ద్వారా సమాచారం చేర వేస్తున్నామని తెలిపారు. ఏదైనా సమాచారం కోసం 94489 01318 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.
తొమ్మిదో తరగతి ఫలితాలు
నవోదయలో తొమ్మిదో తరగతి ఖాళీ సీట్ల భర్తీ కోసం ఫిబ్రవరి 8న నిర్వహించిన ఎంట్రెన్స్ పరీక్ష (లేటరల్ ఎంట్రీ) ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. హాల్‌టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేసి ఫలితాలను నవోదయ విద్యాలయ సమితికి చెందిన హెచ్‌టీటీపీఎస్://సీబీఎస్‌ఈఐటీ.ఇన్/సీబీఎస్‌ఈ/2025/ఎన్‌వీఎస్–ఆర్‌ఈఎస్‌యూఎల్‌టీ/ఆర్‌ఈఎస్‌సీఎల్‌ఎస్‌ఐఎక్స్.ఏఎస్‌పీఎక్స్ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చన్నారు.
ఆరో తరగతిలో ప్రవేశాలు
తొమ్మిదో తరగతి
ఖాళీ సీట్ల భర్తీ ఫలితాలు కూడా..
వివరాలు వెల్లడించిన
ప్రిన్సిపాల్ రాజేందర్