టీపీటీఎఫ్ డిమాండ్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: సమగ్ర కుటుంబ సర్వే విధుల్లో పాల్గొన్న సిబ్బందికి తక్షణమే సర్వే రెమ్యూనరేషన్ చెల్లించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ వద్ద టీపీటీఎఫ్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సంద ర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ...గతేడాది నవంబర్‌లో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఉపాధ్యాయులు, ఇతర శాఖల ఉద్యోగులకు రూ.10 వేల రెమ్యూనరేషన్ ప్రకటించిందన్నారు. 15 రోజుల్లోనే సర్వే పూర్తి చేసి ఇచ్చినా ఇప్పటివరకు వారికి ఆ మొత్తాన్ని చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఐదు డీఏలను పెండింగ్‌లో పెట్టడం సమంజసం కాదని, గతేడాది నుంచి పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్‌తోపాటు ఇతర పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ పరమేశ్వర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాంచందర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య యాదవ్, రాష్ట్ర కౌన్సిలర్లు సంజీవయ్య సుభాష్ బాబు, భాస్కర్, కమ్రుద్దీన్, జిల్లా ఉపాధ్యక్షుడు నాసర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.