గాలి వాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

గాలి వాన బీభత్సం

Published Fri, Apr 11 2025 8:54 AM | Last Updated on Fri, Apr 11 2025 8:54 AM

గాలి

గాలి వాన బీభత్సం

శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025
● కొన్ని మండలాల్లో నేలకొరిగినవిద్యుత్‌ స్తంభాలు, వృక్షాలు ● ట్రాఫిక్‌, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ● నేలరాలిన మామిడి కాయలు ● వరి, జొన్న పంటలకు భారీ నష్టం

అడుగంటిన నీళ్లు..

పంట చేతికొచ్చే దశల ఎండిపోతుండటంతో రైతులు కన్నీరు పెడుతున్నారు.

వివరాలు 8లో u

సంగారెడ్డి జోన్‌/న్యాల్‌కల్‌(జహీరాబాద్‌)/కల్హేర్‌(నారాయణఖేడ్‌)/నారాయణఖేడ్‌/వట్‌పల్లి(అందోల్‌)/మునిపల్లి(అందోల్‌):

జిల్లాలో గురువారం పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. కొన్ని చోట్ల విద్యుత్‌ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్‌ తీగలు తెగిపడటంతో పలు మండలాల్లో కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని మండలాల్లో జొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

సంగారెడ్డి పట్టణంలో బలమైన ఈదురుగాలులు వీస్తూ ఓ మోస్తారుగా వడగళ్ల వర్షం కురిసింది. జహీరాబాద్‌లోని న్యాల్‌కల్‌ మండలంలో ఈదురుగాలులలతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. హద్నూర్‌, గుంజోటి, రాంతీర్థ్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. చెట్లు విరిగిపోయి రోడ్లపై పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా పలు గ్రామాల్లో జొన్న పంట నేలవాలింది. ఇక నారాయణఖేడ్‌లోని కల్హేర్‌, సిర్గాపూర్‌ మండలాల్లో ఖానాపూర్‌(కె), బీబీపేట్‌, పోచాపూర్‌ శివారులో పంట పొలాల్లో వరి పంట నేలవాలింది. కృష్ణాపూర్‌, ఇందిరానగర్‌ వద్ద రోడ్లపై ఆరబెట్టిన జొన్న కంకులు తడిచిపోయాయి. మహదేవుపల్లిలో వర్షం ధాటికి ఇళ్లపై రేకులు ఎగిరిపడ్డాయి. బాచేపల్లిలో రామాలయం వద్ద జాతరలో దుకాణాలు ఎగిరిపోయాయి. దీంతో కుస్తీ పోటీలు రద్దు చేశారు. అందోలు మండలంలో పలు చెట్ల కొమ్మలు విరిగి పడగా, మామిడి కాయలు నేలరాలాయి. పంట పొలాలకు వెళ్లే దారికి అడ్డంగా చెట్ల కొమ్మలు పడటంతో రైతులు ఇబ్బందులు పడ్డారు.

నిలిచిన విద్యుత్‌ సరఫరా

నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు పట్టణంలోని పలు హోటళ్లు, ఇళ్లపైకప్పులు ఎగిరిపడ్డాయి. పట్టణంతోపాటు పంచగామ కమాన్‌ ప్రాంతంలో విద్యుత్‌ వైర్లు దెబ్బతినడంతో 2.30 గంటల నుంచి 7.30గంటల వరకు కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మామిడి కాత రాలిపోయింది. పలు మండలాల్లో వరి, జొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మాద్వార్‌లో ఇళ్లపైకప్పు రేకులు ఎగిరిపడటంతోపాటు పలు చెట్లు విరిగి పడ్డాయి. నిజాంపేట్‌లో వరదనీరు రోడ్లపై ఉధృతంగా ప్రవహించింది. మునిపల్లి మండలంలోని ఈదురు గాలులకు ఇండ్లపై కప్పులు, రేకులు ఎగిరిపడ్డాయి. విద్యుత్‌ తీగల కింద చెట్లు ఉండటంతో చెట్ల కొమ్మలకు విద్యుత్‌ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. దీంతో ఇళ్లలో షార్ట్‌ సర్క్యూట్‌తో ఆయా గ్రామాల్లో టీవీలు, విద్యుత్‌ బల్బులు, మోటార్లు కాలిపోయాయి.

సిర్గాపూర్‌లో అత్యధిక వర్షపాతం...

కురిసిన భారీ వర్షంతో రాష్ట్రంలోనే సిర్గాపూర్‌ మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మండలంలో అత్యధికంగా 41.8మి.మీ నమోదైంది. నాగల్‌గిద్దలో 30.0మి.మీ, నారాయణఖేడ్‌లో 19.3మి.మీ, న్యాల్‌కల్‌లో 20.5మి,మీ, సంగారెడ్డిలో 15.3, జహీరాబాద్‌లో 10.8, కంగ్టిలో 9.0, కల్హేర్‌లో 6.3, మనూరులో 5.8 మి.మీ వర్షపాతం నమోదైంది.

బాచేపల్లిలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు

న్యూస్‌రీల్‌

గాలి వాన బీభత్సం 1
1/3

గాలి వాన బీభత్సం

గాలి వాన బీభత్సం 2
2/3

గాలి వాన బీభత్సం

గాలి వాన బీభత్సం 3
3/3

గాలి వాన బీభత్సం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement