
గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన
జహీరాబాద్ టౌన్: పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. పట్టణంలోని బాగారెడ్డిపల్లిలో గ్యాస్ సిలిండర్‌లతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ డివిజన్ కార్యదర్శి నర్సిహులు మాట్లాడుతూ గ్యాస్ ధరలను పెంచడం వల్ల సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించినా ఒక్క రుపాయి కూడా రావడం లేదన్నారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో నాయకులు వినయ్‌కుమార్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.