విద్యార్థుల నమోదులో తేడా రావొద్దు: డీఈఓ
జగదేవ్‌పూర్(గజ్వేల్): ఎడ్యుకేషన్ యాప్‌లో వ్యత్యాసం లేకుండా విద్యార్థుల సంఖ్యను నమోదు చేయాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయాన్ని సందర్శించారు. అలాగే జీవశాస్త్రం, సాంఘికశాస్త్రంపై ఉపాధ్యాయులకు కొనసాగుతున్న శిక్షణ తరగతులను పరిశీలించారు. తిగుల్, మునిగడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో పరీక్షల విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడ్యుకేషన్ యాప్‌లో వివరాలను సక్రమంగా నమోదు చేయాలన్నారు. లేనట్లయితే కేంద్రం నుంచి పాఠశాలలకు వచ్చే నిధులు ఆగిపోతాయని చెప్పారు. మునిగడప పాఠశాలలో భోజనం చేసే విద్యార్థుల సంఖ్యకు, రికార్డు నమోదులో తేడా ఉండడం వల్ల ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ మాధవరెడ్డి, ప్రధానోపాధ్యాయులు సైదులు, కనకయ్య సరిత తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారిణికి
సీపీ అభినందనలు
సిద్దిపేటకమాన్: ఆర్చరీ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్ షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించిన రశ్మితరెడ్డిని సీపీ అనురాధ సోమవారం అభినందించారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో 9వ తరగతి చదువుతన్న రశ్మితరెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. సీపీ, పోలీసు అధికారులు అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సమయ పాలన పాటించండి
డీఎంహెచ్‌ఓ పల్వాన్‌కుమార్
సిద్దిపేటకమాన్: పల్లె దవాఖాన వైద్యులు, సిబ్బంది సమయపాలనను కచ్చితంగా పాటించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పల్వాన్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో వైద్యాధికారులు, సిబ్బందితో డీఎంహెచ్‌ఓ సోమవారం సమావేశం నిర్వహించారు. పల్లె దవాఖాన వైద్యుల అసోసియేషన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ వైద్యులు పల్లె ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, విధుల్లో అలసత్వం తగదని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సమస్యలుంటే తెలపండి
జిల్లా న్యాయమూర్తి స్వాతిరెడ్డి
సిద్దిపేటకమాన్: వైద్యులు, పేషెంట్లకు ఏమైనా సమస్యలు ఉంటే లీగల్ ఎయిడ్‌లో తెలపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను న్యాయమూర్తి స్వాతిరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లీగల్ ఎయిడ్ క్లినిక్‌లో ఒక ప్యానెల్ లాయర్, పారా లీగల్ వలంటరీని నియమించినట్లు తెలిపారు. ఈ సెంటర్ ద్వారా న్యాయపరమైన సలహాలు, చట్టాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్, సైకియాట్రి విభాగ హెచ్‌ఓడీ డాక్టర్ శాంతి, ఆర్‌ఎంఓలు పాల్గొన్నారు.
విద్యార్థుల నమోదులో తేడా రావొద్దు: డీఈఓ
విద్యార్థుల నమోదులో తేడా రావొద్దు: డీఈఓ
విద్యార్థుల నమోదులో తేడా రావొద్దు: డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment