రేవంత్‌ది తొండి ఆట
సిద్దిపేటజోన్: ప్రతి ఆటలో గెలుపు, ఓటమి సహజమని, రేపటి విజయానికి ఓటమి నాంది లాంటిదని, అయితే రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆడుతున్నది తొండి, గండి ఆట అని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం రాత్రి స్థానిక స్టేడియంలో కేసీఆర్ టోర్నీ విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో తాను గతంలో లెక్క టెస్ట్ మ్యాచ్ ఆడటం లేదని, టీ20మ్యాచ్ అడుతున్నట్లు చెప్పారని, అయితే సీఎం ఆడుతున్నది తొండి, గండి మ్యాచ్ అని ఎద్దేవా చేశారు. మాటలు తొండి, హామీలు గండి అని అన్నారు. కేసీఆర్ ఆటలో ఆయన ఆల్ రౌండర్ అని అభివర్ణించారు. సీఎం రేవంత్ సచివాలయానికి వెళ్లక ఆరు నెలలు అయిందని, ప్రజలను కలవడం లేదన్నారు. ప్రస్తుతం పల్లెల్లో ప్రజలు మళ్ళీ కేసీఆర్ కావాలి, రావాలి అని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల కేసీఆర్ క్రికెట్ టోర్నీలో 378జట్లతో భారీ టోర్నమెంట్ నిర్వహించడంపై ఆసియన్ బుక్ ఆఫ్ రికార్డ్, అవార్డును నిర్వాహకులు ఎమ్మెల్యే హరీశ్ రావుకు అందజేశారు.
మాజీమంత్రి హరీశ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment