బాలికల విద్యకు తోడ్పాటు భేష్
డీఐఈఓ రవీందర్‌రెడ్డి
సిద్దిపేటడ్యుకేషన్(సిద్దిపేట): బాలికల విద్యకు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తోడ్పాటునివ్వడం అభినందనీయమని ఇంటర్మీడియెట్ విద్యశాఖ జిల్లా అధికారి రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో ట్రస్ట్ ఆధ్వర్యంలో 60 మంది నిరుపేద విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవీందర్‌రెడ్డి మాట్లాడు తూ మలబార్ నేషనల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం సామాజిక సేవా కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 60మంది పేద విద్యార్థులను ఎంపిక చేసి స్కాలర్‌షిప్ అందజేయడం గొప్ప విషయమన్నారు. విద్యార్థులు పై చదువులకు ఉపయోగించి ఉన్నతంగా రాణించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు పాలొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment