నిధులు విడుదల చేయాల్సిందే..
పంచాయతీ కార్యదర్శులు స్పష్టీకరణ
జగదేవ్‌పూర్(గజ్వేల్): గ్రామ పంచాయతీల నిర్వహణను మార్చి నెల నుంచి చేయలేమని కార్యదర్శులు సోమవారం ఎంపీడీఓ యాదగిరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్‌ల పదవీకాలం పూర్తయి యేడాది గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాలేదన్నారు. పంచాయతీ నిర్వహణ కార్యదర్శిలపై పడుతోందని వాపోయారు. ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిధులు, రాష్ట్ర పైనాన్స్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment