గజ్వేల్‌రూరల్: ఎల్లమ్మ ఆలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ మెదక్ ఎంపీ రఘునందన్‌రావును ప్రజ్ఞాపూర్ గ్రామస్తులు కోరారు. బీజేపీ పట్టణశాఖ అధ్యక్షుడు మనోహర్‌యాదవ్‌తో కలిసి శనివారం హైదరాబాద్‌లో కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ ఆలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు. వెంకట్‌రెడ్డి, శ్రీను, రాజు, దేవేందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో
నాణ్యమైన విద్య
మద్దూరు(హుస్నాబాద్): అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎంపీడీఓ రామ్మోహన్ అన్నారు. శనివారం దూల్మిట్ట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో సీఆర్‌పీ నారదాసు ఉమాదేవి అధ్యక్షతన నిర్వహించిన ఈసీసీఈ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సద్దేశ్వర్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
ఉరి వేసుకొని
వ్యక్తి ఆత్మహత్య
సిద్దిపేటఅర్బన్: మానసిక పరిస్థితి సరిగాలేని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం మండలంలోని పొన్నాల గ్రామంలో చోటుచేసుకుంది. త్రీ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మర్కంటి పోచయ్య (61)కు యేడాది నుంచి మానసిక పరిస్థితి సరిగాలేదు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇంటి స్లాబ్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ మృతి
సిద్దిపేటఅర్బన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొండపాక మండలం మర్పడగ గ్రామానికి చెందిన ఉడెం మల్లారెడ్డి(55) శుక్రవారం రాత్రి సిద్దిపేటకు వచ్చి తిరిగి స్వగ్రామం వెళ్తుండగా పొన్నాల శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న వాహనదారుడు గమనించి 108కి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుడి కొడుకు రవీందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment