నిత్య వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం
హుస్నాబాద్: నిత్యం వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. పట్టణానికి చెందిన ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య తన 55వ జన్మదినం సందర్భంగా శనివారం 10 కిమీ. పరుగు పందెం పూర్తి చేశాడు. అనంతనం గాంధీ చౌరస్తాలో ఆయనను శాలువాతో అభినందించారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ వయస్సుతో నిమిత్తం లేకుండా మంచి ఆరోగ్యపు అలవాట్లతో నిత్యం శారీరక దారుఢ్యాన్ని పెంపొందించవచ్చన్నారు. కార్యక్రమంలో టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ హుస్సేన్, మిత్రమండలి–87 స్వచ్ఛంధ సంస్థ నాయకులు శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, మోహన్, వర ప్రసాద్, రవీందర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment