సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
దుబ్బాకటౌన్: సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలు నియంత్రించవచ్చని తొగుట సీఐ షేక్ లతీఫ్ అన్నారు. రాయపోల్ మండలం రామారంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ఎస్‌ఐ రఘుపతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్ది రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాలలో దొంగతనాలు జరుగుతున్నాయని, సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను పట్టుకోవడం కష్టమవుతుందన్నారు. కార్యక్రమంలో రామారం గౌడ సంఘం అధ్యక్షుడు శంకర్ గౌడ్, మాజీ సర్పంచ్ మహేశ్ గౌడ్, గౌడ సంఘ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సీఐ షేక్ లతీఫ్
Comments
Please login to add a commentAdd a comment