
ఉత్సాహంగా వీడ్కోలు సమావేశాలు
మద్దూరు(హుస్నాబాద్): ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ సురేశ్‌రెడ్డి ఆకాంక్షించారు. కళాశాలలో శనివారం ఉత్సాహంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ గ్రామాల్లో పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను కళాశాలలో చేర్పించాలన్నారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కంఠరెడ్డి జనార్దన్‌రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనువాస్, బాలసిద్దులు తదితరులు పాల్గొన్నారు.
చక్కగా చదువుకోవాలి
నంగునూరు(సిద్దిపేట): పరీక్షలకు భయపడకుండా విద్యార్థులు చక్కగా చదివి మంచి మార్కులు సాధించాలని అక్కేనపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జానయ్య కోరారు. పదోతరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శనివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం రామస్వామి, శ్రీనివాస్, రజిత, పవన్‌కుమార్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment