
కంప్యూటర్ శిక్షణతో ఉజ్వల భవిష్యత్
● ఎన్‌ఆర్‌ఐ ప్రతాప్‌రెడ్డి ● రూ.4.62లక్షలతో ల్యాబ్ ఏర్పాటు
చేర్యాల(సిద్దిపేట): విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు కంప్యూటర్ శిక్షణ ఎంతో దోహదపడుతుందని మండల పరిధిలోని ముస్త్యాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐ, రిటైర్డ్ కంప్యూటర్ సైన్స్ ప్రొపెసర్ పెడతల ప్రతాప్‌రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సొంత నిధులు రూ.4లక్షల 62వేలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన ఈ ప్రాంత విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్ ఉండాలన్న ఉద్దేశ్యంతోనే కళాశాలలో 10 కొత్త మోడల్ కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రిన్సిపాల్ ప్రణీత మాట్లాడుతూ విద్యార్థులు అధునాతన కోర్సులు నేర్చుకోవడానికి ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కంప్యూటర్ విభాగాధిపతి నరేశ్‌కుమార్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో కళాశాల విద్యార్థులతో పాటు పరిసర గ్రామాలకు చెందిన ఇంటర్ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. అలాగే కళాశాలలో గ్రంథాలయ ఏర్పాటుకు రూ.లక్ష విరాళం అందించేందుకు ప్రతాప్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డికి అధ్యాపకులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment