
అగ్గితెగులు నివారణకు చర్యలు
తొగుట(దుబ్బాక): వరికి సోకే అగ్గితెగులు నివారణకు చర్యలు తీసుకోవాలని ఎఈఓ నాగార్జున రైతులకు సూచించారు. మండలంలోని పెద్ద మాసాన్‌పల్లిలో శనివారం వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వరిపంట చిరుపొట్ట దశ నుంచి కంకి పాలుపోసుకునే దశలో ఉందన్నారు. అక్కడక్కడా వరికి అగ్గితెగులు సోకినట్టు గమనించామని తెలిపారు. ఈ తెగులు వల్ల ఆకులపై ముదురు రంగు అంచుతో మధ్యలో బూడిదరంగుగల నూలుకండె ఆకారం మచ్చలు ఏర్పడతాయని చెప్పారు. ఉధృతి పెరిగినప్పుడు మచ్చలు కలసిపోయి ఆకులు ఎండిపోయి పొలం తగలబడినట్టు కనిపిస్తుందని తెలిపారు. ఆకుమచ్చ దశలోనే నివారించకపోతే అధికంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఈ తెగులు నివారణ కోసం ఎకరాకు ఐసోప్రోధయోలెన్ 300 మిల్లీ లీటర్లు, లేదా ట్రైసైక్లోజోల్, మ్యాంకోజెబ్ 500 గ్రాములు లేదా కాసుగామైసిన్ 500 మిల్లీ లీటర్లు స్ప్రే చేయాలని రైతులకు సూచించారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.
నివారణ చర్యలతో తగ్గుముఖం
సిద్దిపేటఅర్బన్: నివారణ చర్యలతో వరిలోకి సోకుతున్న ఎండు తెగులును తగ్గించుకోవచ్చని అర్బన్ మండల ఏఓ బి.శ్రీనాథ్ చెప్పారు. శనివారం రంగధాంపల్లిలో రైతు వంగ నాగిరెడ్డికి చెందిన వరి పైరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉష్ణోగ్రతల్లో ఉండే అధిక వ్యత్యాసం వల్ల కానీ నత్రజనిని అధికంగా వాడటం వల్ల కానీ ఈ తెగులు సోకుతుందన్నారు. దీని నివారణకు కోసైడ్ (కాపర్ హైడ్రాకై ్సడ్) మందును ఎకరాకు 400 గ్రాములు వాడాలని సూచించారు. ఆయన వెంట ఏఈఓ పవన్ ఉన్నారు.
ఎఈఓ నాగార్జున
Comments
Please login to add a commentAdd a comment